Big Scam: హైదరాబాద్‌లో రూ.150 కోట్ల స్కామ్‌..

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ బయటడింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Big Scam in Hyderabad

Big Scam in Hyderabad

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ బయటడింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్‌ గణేశ్‌నగర్‌లో కొంతమంది 'ది పెంగ్విన్ సెక్యూరిటీస్‌' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు అంటూ మదుపర్లను నమ్మించారు. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

ఇలా వాళ్ల నుంచి ఏకంగా దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూలు చేశారు. వీళ్లను నమ్మి చాలామంది రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బాండ్ల రూపంలో పెట్టారు. మొత్తం 1500 మంది వరకు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. చివరికీ ఇది బోగస్ కంపెనీ అని. తాము మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పెద్దఎత్తున జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.      

Also Read: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!

ఇదిలాఉండగా.. సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. కిలోన్నర హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌ సమీపంలో నిందితులు ఓ డాబాలో డ్రగ్స్‌ విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ను సీజ్ చేశారు. వీటి విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. నగరంలో వంటమనిషిగా పనిచేసే వికాస్ సోహూ అనే నిందితుడు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడని చెప్పారు. డాబాకు వచ్చే కమస్టమర్లుకు మాత్రమే అమ్ముతున్నట్లు తెలిపారు. 

 telugu-news | rtv-news | hyderabad | stock-market | jeedimetla

Advertisment
తాజా కథనాలు