KCR: నవీన్ యాదవ్ ఓ రౌడీ.. కేసీఆర్ సంచలన ఆరోపణలు!-VIDEO

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీ షీటర్ ని నిలబెట్టి హైదరాబాద్ ప్రజలకు పరీక్ష పెట్టిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి శాంతిభద్రతలు కాపాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

New Update
Naveen yadav Vs KCR

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(jubilee hills by elections 2025) లో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీ షీటర్ ని నిలబెట్టి హైదరాబాద్ ప్రజలకు పరీక్ష పెట్టిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు(KCR Comments On Jubilee Hills Elections). రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి శాంతిభద్రతలు కాపాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై వివరించాలని సూచించారు. 

Also Read :  సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా? ఈ గుడ్ న్యూస్ మీ కోసమే.. ఆ నిబంధనకు గుడ్ బై

KCR Comments On Jubileehills Congress Candidate Naveen

ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి ప్రచారంలో పేర్కొన్నారు. మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు. 

Also Read :  నవీన్ యాదవ్ ఓ రౌడీ.. కేసీఆర్ సంచలన ఆరోపణలు!

Advertisment
తాజా కథనాలు