BIG BREAKING: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. దసరా వేళ వినియోగదారులకు బిగ్ షాక్!

దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.16 వరకు పెరిగినట్లు తెలిపింది. అయితే గృహ వినియోగం కోసం వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదని తెలిపాయి.కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలు మాత్రమే పెరిగాయి.

New Update
gas cylinder

gas cylinder

గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతీ నెల తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. ప్రతీ నెల ఒకటో తారీఖున చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తాయి. అయితే దసరా పండుగకు చమురు కంపెనీలు బిగ్ షాక్‌ ఇచ్చాయి. దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ.16 వరకు పెరిగినట్లు తెలిపాయి. అయితే గృహ వినియోగం కోసం వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదని తెలిపాయి.కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలు మాత్రమే పెరిగాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1595.50 ఉంది. చెన్నైలో రూ.1,738 గా ఉన్న ధర రూ.1,754కు పెరిగింది.

ఇది కూడా చూడండి: Amazon Laptop offers: అమెజాన్‌లో జింగ్ జింగ్ ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌లు వెరీ చీప్ బ్రో

నేటి నుంచి ఈ మార్పులు కూడా..

ఇదిలా ఉండగా నేటి నుంచి గ్యాస్ ధరలతో  పాటు మరికొన్ని మార్పులు ఉన్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఓ ముఖ్య నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు అమల్లోకి రాబోతోంది. ఈ కొత్త చట్టం ప్రకారం, ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ అన్నీ నిషేధిస్తారు. అలాగే రైలు ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్, రద్దు నియమాలు కూడా నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. రైల్వే కొత్తగా ఆధార్ వెరిఫికేషన్ రూల్‌ను తీసుకొచ్చింది. టికెట్ బుకింగ్ ప్రక్రియ మొదలైన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే, ఆ వ్యక్తి ఆధార్ వెరిఫికేషన్ తప్పకుండా పూర్తి అయి ఉండాలి. బ్యాంకుల్లోని వడ్డీ రేట్లు, రుణాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, ఇతర పొదుపు పథకాలలో కూడా అక్టోబర్ 1 నుంచి మార్పులు ఉండే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టే ప్రజలు తమ డబ్బును పెట్టే ముందు ఈ కొత్త మార్పులను తప్పకుండా తెలుసుకోవాలి.

ఇది కూడా చూడండి: October New Rules: గ్యాస్ సిలిండర్ నుంచి బ్యాంకింగ్, ట్రైన్ టికెట్ల బుకింగ్ వరకు.. నేటి నుంచి మారే రూల్స్ ఇవే!

యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విషయంలో వినియోగదారుల భద్రతను పెంచడానికి అక్టోబర్ 1 నుంచి మార్పులు రానున్నాయి. యూపీఐ ఐడీని ఉపయోగించి ఒకరి నుంచి మరొకరికి నేరుగా డబ్బులు పంపడానికి కుదరదు. ఇకపై డబ్బులు పంపాలంటే స్కానింగ్ (QR కోడ్) లేదా ఫోన్ నంబర్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులు ఈక్విటీలలో (షేర్ మార్కెట్‌లో) వంద శాతం వరకు తమ పెన్షన్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా, ఇతర చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు