Vivo Y400 Pro 5G: వివో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త ఫోన్ సూపరెహే - ధర, ఫీచర్లు అదుర్స్!

Vivo Y400 Pro 5G భారత మార్కెట్‌లో రిలీజ్ అయింది. దీని 8/128GB ధర రూ. 24,999, 8/256GB ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 27 నుండి కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. 50MP+2MP బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

New Update
Vivo Y400 Pro 5G price

Vivo Y400 Pro 5G price

Vivo తన Y400 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y400 Pro 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.77-అంగుళాల 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌తో వచ్చింది. Android 15పై నడుస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

Vivo Y400 Pro 5G Price

Vivo Y400 Pro 5G ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. అలాగే 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది జూన్ 27 నుండి Amazon, Flipkart, Vivo India ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రీ-బుకింగ్ నేటి నుండి స్టార్ట్ అయింది. 

Also Read: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

Vivo Y400 Pro 5G Colors & Offers

Y400 Pro 5G ఫోన్ ఫ్రీస్టైల్ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబ్యులా పర్పుల్ కలర్‌లలో వచ్చింది. లాంచ్ ఆఫర్లలో భాగంగా.. SBI కార్డ్, DPS బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్, ఫెడరల్ బ్యాంక్ ట్రాన్షక్షన్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్, 10 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌లు ఉన్నాయి. 

Also Read: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

Vivo Y400 Pro 5G Specifications

Vivo Y400 Pro 5G ఫోన్ 6.77-అంగుళాల పూర్తి HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. అలాగే ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 4nm ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ Android 15 ఆధారంగా FuntouchOS 15పై పనిచేస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX 882 కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు