/rtv/media/media_files/2025/06/12/CTkdJiI7Qxm5xeRC5jvt.jpg)
vivo v50 price drop in vijay sales
టెక్ బ్రాండ్ వివో ఇటీవల తన లైనప్‌లో ఉన్న Vivo V50 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అదిరిపోయే కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్, ఫోన్ స్లిమ్ అండ్ డిజైన్ కారణంగా ఎక్కువ మంది ఈ ఫోన్‌ను కొనేందుకు ఇష్టపడుతున్నారు. మరి మీరు కూమా ఈ Vivo V50 ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రిటైల్ సైట్ విజయ్ సేల్స్ వివో వి50 పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే గొప్ప బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది.
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
Vivo V50 Price & Offers
Vivo V50 ఫోన్‌లోని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.34,999 కు ప్రారంభించబడింది. ఇప్పుడు ఇది విజయ్ సేల్స్‌లో రూ.32,999 కు జాబితా చేయబడింది. అలాగే కోటక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు (రూ.2500 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ.30,499కి సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్ లాంచ్ ధర కంటే మొత్తం రూ.4500 తక్కువ ధరకు లభిస్తుంద అన్న మాట.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
Vivo V50 Specifications
Vivo V50 లో 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ FHD + AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 2392 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పై పనిచేస్తుంది.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
V50 వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!
tech-news | mobile-offers | telugu tech news