Trump: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి.. రవిప్రకాష్ సెటైరికల్ ట్వీట్‌

ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవి ప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్‌ చేశారు.

New Update
Rtv Ravi praksh satirical tweet about Donald trump on Noble peace Prize

Rtv Ravi praksh satirical tweet about Donald trump on Noble peace Prize

ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాలు తప్పుబట్టాయి. ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ట్రంప్‌ మాత్రం వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కించుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్.. నోబెల్‌ శాంతి బహుమతి కోసం ట్రంప్‌ పేరును అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల ఒప్పందం జరిగడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని కొనియాడింది. కానీ ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పాక్ కూడా ఖండించింది.

Also Read: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా సంచలన నిర్ణయం.. ‘ఇరాన్‌కి అణ్వాయుధాలు’

ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందా ? రాదా ? అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై RTV రవిప్రకాష్ ఎక్స్‌లో ట్రంప్‌పై ఓ సెటైరికల్ ట్వీట్‌ చేశారు. 

'' నోబెల్ శాంతి బహుమతి ఆశావాహుడి నుంచి శరణార్థిగా మారడానికి మూడు సులభమైన పద్ధతులు ఏంటి ? 

స్టెప్ 1: ట్రంప్‌గా ఉండాలి
స్టెప్ 2: ఎన్నికల్లో గెలవాలి, కానీ బుద్ధి కోల్పోవాలి.
స్టెప్ 3: పేపర్‌పై శాంతికి మధ్యవర్తిత్వం వహించాలి, యుద్ధాల్లో నిధులు సమకూర్చాలి. మూడో ప్రపంచ యుద్ధానికి తెర లేపినప్పటికీ అమెరికా ప్రపంచాన్ని రక్షించిందని గట్టిగా అరవాలి.

దేశం నుంచి వెలివేసేందుకు మీరు అర్హులయ్యారు, మీకు అభినందనలు'' అంటూ రవి ప్రకాశ్‌ ట్రంప్‌ను సెటైరికల్‌గా విమర్శిస్తూ రాసుకొచ్చారు. 

Also Read: ఇక భారత్‌కు కష్టకాలమే.. భారీగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన స్టాక్ మార్కెట్లు

ఆ ట్వీట్‌కు ఆయన ఓ ఫన్నీ మీమ్‌ను కూడా జతచేశారు. అందులో గమనిస్తే ట్రంప్‌ను ఇతర దేశాధినేతలు దూరం పెట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ మీమ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మీమ్‌ మొదటి ఫొటోలో ట్రంప్‌.. నేను జిన్‌పింగ్‌తో ఒప్పందం కుదుర్చానని అంటారు. దీనికి జిన్‌పింగ్‌ నేను ఒప్పందం కుదర్చలేదని చెబుతాడు. రెండో ఫొటోలో ట్రంప్‌.. నేను భారత్-పాక్‌ మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిపానంటే దీనికి మోదీ ఆయన చేయలేదని అంటారు. ముడో ఫొటోలో ట్రంప్.. ఇరాన్ నాకు కాల్ చేసిందని చెబితే.. దీనికి ఇరాన్ అధ్యక్షుడు మేము చేయలేదని చెబుతాడు. ఇక నాలుగో ఫొటోలో ట్రంప్‌.. పుతిన్ నన్ను జీనియస్ అని పిలిచాడని చెబుతారు. దీనికి పుతిన్ నేను అలా అనలేదని అంటారు. 

Also Read: యుద్ధంలోకి నార్త్ కొరియా.. ఇరాన్‌కు నేనున్నానంటూ కిమ్

ఇదిలా ఉండగా ఇటీవల ట్రంప్‌ కూడా తనకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కదేమో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు లేదా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షలు నివారించేందుకు పోరాడుతున్నందుకు తనకు ఆ బహుమతి దక్కదేమో అంటూ నిరాశ వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి తనకు రాసిపెట్టి లేదేమోనని.. తాను ఎన్ని మంచి పనులు చేసినా ఆ బహుమతి దక్కదంటూ వాపోయారు. మరోవైపు ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత.. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌లో 'థాంక్యూ ప్రెసిడెంట్ ట్రంప్‌' అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఇప్పటికే ఇరాన్‌పై అమెరికా దాడులను చైనా, రష్యా, ఉత్తర కొరియా ఖండించాయి. ఈ నేపథ్యంలో మరీ వచ్చే ఏడాది ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి రావడం కష్టమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు