/rtv/media/media_files/2025/07/07/ulefone-armor-x16-2025-07-07-17-56-24.jpg)
Ulefone Armor X16
ఉలేఫోన్ కంపెనీ తన లైనప్‌లో ఉన్న మరో కొత్త స్మార్ట్‌ఫోన్ Ulefone Armor X16ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 10,360mAh బ్యాటరీ, IP68, IP69K రేటింగ్ అందించారు. అంటే నీరు, దుమ్ము, షాక్‌ల నుండి రక్షించడానికి మిలిటరీ గ్రేడ్ బలంతో వస్తుంది. 6.56-అంగుళాల HD + IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. వెనుక వైపు 48MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో కెమెరా, 20MP నైట్ విజన్ లెన్స్ ఉన్నాయి.
Also Read: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
Ulefone Armor X16
అయితే ఈ UIefone ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ అయింది. ప్రపంచ మార్కెట్లో ఈ ఫోన్‌ను దాదాపు రూ. 14,500 కు దిగుమతి చేసుకోవచ్చు. అదే సమయంలో దీనిని భారతదేశానికి దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేదు. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Ulefone Armor X32 లాగే , Ulefone Armor X16 కూడా 4G ఫోన్. ఇది మీడియాటెక్ హీలియో G91 చిప్‌సెట్‌ను పొందుతుంది. బడ్జెట్ కేటగిరీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాసెసర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై నడుస్తుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
Also Read: ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా : రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!
Introducing #UlefoneArmorX16 series, the big battery night vision midrange beast!
— Ulefone Mobile (@UlefoneMobile) July 4, 2025
🔋 10,360mAh Massive Battery
🚀 Dimensity 6300 5G(X16 Pro)
🌙 IR Night Vision Camera
🔦 Dedicated Glare Flashlight
Learn more:
X16 Pro: https://t.co/1YZQcrvrPY
X16: https://t.co/fNQB8jb0Kspic.twitter.com/DOI4dTA4CD
కంపెనీ ఇందులో 6.56-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను అందించింది. ఇది HD + రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. పెద్ద బ్యాటరీ, కఠినమైన డిజైన్ కారణంగా ఫోన్ 395 గ్రాముల బరువు ఉంటుంది. ఇది మార్కెట్‌లోని అత్యంత బరువైన ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. Ulefoneలో 48MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 20MP నైట్ విజన్ కెమెరాను కలిగి ఉంది. ముందు కెమెరా గురించి కంపెనీ ఎలాంటి ప్రత్యేక వివరాలను వెల్లడించలేదు.
Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
Also Read : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని..
mobile-offers | new-smartphone