Samsung Galaxy M36 5G: శాంసంగ్ నుంచి కిర్రాక్ ఫోన్.. డిస్కౌంట్ అదిరిపోయింది బాసూ!

శామ్సంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M36 5Gని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 6GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. దీనిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ వేరియంట్ రూ. 16,499 కు అందుబాటులో ఉంది.

New Update
Samsung Galaxy M36 5G

Samsung Galaxy M36 5G

శామ్సంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M36 5Gని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించారు. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

Samsung Galaxy M36 5G Price

Samsung Galaxy M36 5G ఫోన్ 6GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. దీనిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ వేరియంట్ రూ. 16,499 కు అందుబాటులో ఉంది. దీనితో పాటు, ఈ ఫోన్ 8GB RAM - 256GB స్టోరేజ్ ఆప్షన్‌లో కూడా ఉంది. ఇది ఆరెంజ్ హేజ్, సెరీన్ గ్రీన్, వెల్వెట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీని సేల్ జూలై 12 నుండి Samsung అధికారిక సైట్‌, ఈ-కామర్స్ సైట్ Amazon లో ప్రారంభమవుతుంది. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

Samsung Galaxy M36 5G Specifications

Samsung Galaxy M36 5G ఫోన్‌లో 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది పూర్తి HD + రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టా కోర్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ UI 7పై పనిచేస్తుంది. కంపెనీ దీనికి 6 సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. 

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

Galaxy M36 5G వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. రెండు కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌తో వస్తాయి. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు