Refrigerator Tips: ఫ్రిజ్ ను ప్రతీ రోజు ఎంత సేపు ఆఫ్ చేయాలో తెలుసా?

ఫ్రిడ్జ్ వాడేవారు దాని మోటార్ పాడవుతుందని రోజులో కొన్ని సార్లు ఆఫ్ అండ్ ఆన్ చేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదు. ఇప్పుడు వస్తున్న ఫ్రిడ్జ్‌లు వాటంతటవే ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఒకవేళ ఆఫ్-ఆన్ చేస్తే త్వరగా మోటార్ పోయే ఛాన్స్ ఉంటుంది.

New Update
Refrigerator Tips how many times switch off refrigerator everyday is it good or no

Refrigerator Tips how many times switch off refrigerator

వేసవి కాలంలో ఎక్కువ మంది ఫ్రిడ్జ్‌లు వాడుతుంటారు. ఎండకు అలసిపోయిన తర్వాత చల్ల చల్లని నీరు తాగడానికి, ఫుడ్ పాడవకుండా నిల్వ ఉంచడానికి, మరిన్ని పనుల కోసం ఈ సీజన్‌లో ఫిడ్జ్‌లను అధికంగా వాడుతుంటారు. అయితే చాలా మంది ఉదయం కొద్ది సేపు.. రాత్రి కొద్ది సేపు ఫిడ్జ్‌ను ఆపుతూ ఉంటారు. 

Also read : తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

ఫ్రిడ్జ్‌లో ఉండే మోటార్ ఎక్కువసేపు పనిచేయడం వల్ల పాడైపోతుందని అనుకుంటుంటారు. ఒకవేళ మోటార్ పాడైపోతే దాన్ని రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందని భావించి ఫ్రిడ్జ్ ను ఆఫ్, ఆన్ చేస్తుంటారు. మరి కొంతమంది ప్రతిరోజూ ఫ్రిజ్‌ను ఆపి, ఆన్ చేయడానికి బదులుగా.. వారానికి ఒకసారి కొన్ని గంటలు ఆఫ్ చేస్తారు. అయితే రిఫ్రిజిరేటర్‌లోని మోటారు చల్లబడి సరిగ్గా పనిచేయడానికి నిజంగా కొన్ని గంటలు ఫ్రిడ్జ్‌ను ఆపాలా?.. ఇది చాలా మందిలో తొలుస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు దానికి సంబంధించిన అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. 

Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

ప్రతి రోజు ఫ్రిడ్జ్‌ను ఆఫ్ చేయాలా?

ప్రతిరోజూ లేదా వారానికి ఒకసారి కూడా కొన్ని గంటలు ఫ్రిడ్జ్‌ను ఆఫ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అందువల్ల రిఫ్రిజిరేటర్లు వాంఛనీయ ఉష్ణోగ్రత (Optimum temperature) టెక్నాలజీతో వస్తున్నాయి. అందువల్ల రిఫ్రిజిరేటర్‌ను ఆపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న ఫ్రిడ్జ్‌లు అన్నీ అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నాయి. దీని కారణంగా అవసరమైనపుడు వాటంతట అవే ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. వాటిని మాన్యువల్‌గా ఆన్ అండ్ ఆఫ్ చేయవలసిన అవసరం లేదు. 

Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

అలా ఎందుకు ? 

Temperature Control: రిఫ్రిజిరేటర్లలో థర్మోస్టాట్లు ఉంటాయి. ఇవి అవసరమైన ఉష్ణోగ్రతను ఉంచడానికి కంప్రెసర్‌ను స్వయంగా వాటంతట అవే ఆన్ అండ్ ఆఫ్ చేస్తాయి.

Effect: రిఫ్రిజిరేటర్‌ నిరంతరం పనిచేసినపుడు ఎలాంటి ఎక్కువ ఖర్చు అవ్వదు. అదే పదే పదే ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల ఎక్కువ శక్తి ఖర్చవుతుంది.

food spoiling Fear: ఫ్రిజ్‌లో ఆహారం చెడిపోకుండా ఉండేందుకు అందులోని స్థిరమైన టెంపరేచర్‌ను ఉంచడం చాలా అవసరం. ఒకవేళ ఫ్రిజ్‌ను పదే పదే ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల ఫుడ్ పాడైపోయే అవకాశం ఉంటుంది. 

compressor Damage: తరచుగా ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల కంప్రెసర్ లైఫ్ టైమ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 

Moisture and mold: రిఫ్రిజిరేటర్‌ను క్లోజ్ చేసేముందు దాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో తేమ, బూజు పేరుకుపోతుంది.

fridge | fridge tips | latest-telugu-news | refrigerator-tips

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు