Mobile Offer: అయ్య బాబోయ్.. OnePlus ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేయండి మావా!

ఫ్లిప్‌కార్ట్‌లో OnePlus Nord CE4 Lite 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు రూ.16,825కి కొనుక్కోవచ్చు. అలాగే రూ.1250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీంతో మరింత తక్కువకే లభిస్తుంది.

New Update
OnePlus Nord CE4 Lite 5G smartphone

OnePlus Nord CE4 Lite 5G smartphone

తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్ పై కళ్లు చెదిరే తగ్గింపు అందుబాటులో ఉంది. అందువల్ల తక్కువ ధరలో.. భారీ డిస్కౌంట్‌తో ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఇప్పుడు ఈ OnePlus Nord CE4 Lite 5G ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..

OnePlus Nord CE4 Lite 5G Price 

OnePlus Nord CE4 Lite 5G మొబైల్ 8GB+128GB వేరియంట్ గత ఏడాది జూన్‌లో రూ.19,999కి లాంచ్ అయింది. ఇప్పుడు ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,825 కి లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. BOBCARD కార్డ్ లావాదేవీలపై 10% (రూ.1250 వరకు) తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర రూ.15,575 అవుతుంది. లాంచ్ ధర ప్రకారం.. ఇది దాదాపు రూ.4,424 తగ్గుతోంది. 

Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు

OnePlus Nord CE4 Lite 5G Specs

OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లేనును కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. OnePlus Nord CE4 Lite 5G మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14 పై నడుస్తుంది. Nord CE4 Lite 5G వెనుక భాగంలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. 

Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా

అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం EIS మద్దతుతో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. OnePlus Nord CE4 Lite 5G ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

Advertisment
తాజా కథనాలు