Now or Nothing Sale: అరాచకమైన ‘నథింగ్’ సేల్.. ఫోన్లు, ఇయర్ బడ్స్, వాచ్‌లపై ఆఫర్లే ఆపర్లు!

నథింగ్ రీసెంట్‌గా ‘నౌ ఆర్ నథింగ్’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో నథింగ్, CMF బ్రాండ్‌ల ప్రొడెక్టులపై ఆఫర్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ 3a సిరీస్, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ a, CMF బడ్స్ ప్రో, CMF బడ్స్ ప్రో 2 లను చౌకగా కొనుక్కోవచ్చు. 

New Update
Nothing Announces Now or Nothing Sale in India

Nothing Announces Now or Nothing Sale in India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ రీసెంట్‌గా ‘నౌ ఆర్ నథింగ్’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో నథింగ్, CMF బ్రాండ్‌ల ప్రొడెక్టులపై ఆకర్షణీయమైన డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటుంది. ఇందులో నథింగ్ ఫోన్ 3a సిరీస్, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ a, CMF బడ్స్ ప్రో, CMF బడ్స్ ప్రో 2 లను చౌకగా కొనుక్కోవచ్చు. 

ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!

Now or Nothing Sale

ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ 3a ప్రోని చౌకగా కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ.29,999కి లాంచ్ చేసింది. దీనిపై రూ.1000 ధర తగ్గింపు, రూ.2000 బ్యాంక్ ఆఫర్ ఉంది. ఈ డిస్కౌంట్‌తో రూ.26,999కి సేల్‌లో లభిస్తుంది. 

నథింగ్ ఫోన్ 3a ని కూడా చౌకగా కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ. 24,999 కు లాంచ్ అయింది. ఇప్పుడు రూ.2000 బ్యాంక్ ఆఫర్‌తో రూ. 22,999 కు కొనుగోలు చేయవచ్చు. 

CMF ఫోన్ 2 ప్రోను రూ. 1000 బ్యాంక్ ఆఫర్‌తో రూ. 17,999 కు కొనుగోలు చేయవచ్చు. 

ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!

దీంతో పాటు నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఎ లను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇవి వరుసగా రూ.11,999, రూ.7,999 ధరలకు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సేల్‌లో రూ.8,499, రూ.5,499 ధరలకు కొనుక్కోవచ్చు. 

అలాగే CMF బడ్స్, CMF బడ్స్ ప్రో, CMF బడ్స్ ప్రో 2 లను వరుసగా రూ.1,999, రూ.2499, రూ.3499 కు కొనుగోలు చేయవచ్చు. CMF నెక్‌బ్యాండ్ ప్రోను రూ.1,899లకు, CMF వాచ్ ప్రో, CMF వాచ్ ప్రో 2 ఈ సేల్‌లో రూ.2,999, రూ.4,199 కు అందుబాటులో ఉన్నాయి. 

Also Read :  ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!

Advertisment
Advertisment
తాజా కథనాలు