Motorola Edge 60 Pro: మోటో మామ అదరగొట్టేసాడు.. 50MP ట్రిపుల్ కెమెరాతో కొత్త ఫోన్ మామూలుగా లేదు భయ్యా!

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 30న లాంచ్ కానుంది. వెనుక భాగంలో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. వెనుకవైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ రూ.30 వేల నుండి రూ.35 వేల మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

New Update
Motorola Edge 60 Pro

Motorola Edge 60 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో Motorola Edge 60, Motorola Edge 60 Pro లను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ Motorola Edge 60 Proను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని తేదీని కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

Motorola Edge 60 Pro Launch Date

Motorola Edge 60 Pro స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఏప్రిల్ 30న లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్‌లో తెలిపింది. ఈ ఫోన్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో విడుదలైంది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

Motorola Edge 60 Pro Global Price

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 12+512GB స్టోరేజ్ వేరియంట్ ధర 599.99 GBP (రూ. 68,170)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ స్పార్క్లింగ్ గ్రేప్, షాడో గ్రీన్, డాజ్లింగ్ బ్లూ కలర్‌లలో వస్తుంది. ఈ ఫోన్ UK లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Motorola Edge 60 Pro India Price

భారతదేశంలో Motorola Edge 60 Pro ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ధర ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే భారతదేశంలో తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర కేవలం రూ.30 వేల నుండి రూ.35 వేల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

Motorola Edge 60 Pro Specifications

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i సేఫ్టీ అందించబడింది. ఇది MediaTek Dimensity 8350 Extreme 4nm ప్రాసెసర్‌తో వస్తుంది. 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన లెన్స్, అల్ట్రావైడ్, 3x టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.

 

torola-latest-series | latest-telugu-news | telugu-news | new-smartphone motorola-latest-series

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు