/rtv/media/media_files/2025/05/28/E7vxFHuNtWquMqPzdTYp.jpg)
Motorola Edge 2025
ప్రముఖ టెక్ బ్రాండ్ మోటరోలా మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 2025 స్మార్ట్‌ఫోన్‌ను అమెరికాలో రిలీజ్ చేసింది. ఈ తాజా ఎడ్జ్ సిరీస్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC పై నడుస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ అందించారు. ఇందులో కొత్త AI ఫీచర్లు కూడా ఉన్నాయి. వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, స్పెషిఫికేషన్లు గురించి తెలుసుకుందాం.
Motorola Edge 2025 Price
మోటరోలా ఎడ్జ్ 2025 ఒకే ఒక్క వేరియంట్‌లో లాంచ్ అయింది. దీని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 47,000గా కంపెనీ నిర్ణయించింది. ఇది జూన్ 5 నుండి USలో మోటరోలా వెబ్‌సైట్, బెస్ట్ బై, Amazon.com ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Also Read: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా
Beautiful quad-curved design, and with four pro-grade cameras assisted by moto ai, the NEW motorola edge - 2025 is exceptional from every angle📷📱
— motorolaus (@MotorolaUS) May 27, 2025
Register now for updates: https://t.co/lUUmSmb8FR pic.twitter.com/RYc4uun8xW
Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
Motorola Edge 2025 Specifications
మోటోరోలా ఎడ్జ్ 2025 ఆండ్రాయిడ్ 15 పై హలో UI తో నడుస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల సూపర్ HD pOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoCతో అమర్చబడింది. మోటరోలా ఎడ్జ్ 2025లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో కొత్త AI కీ కూడా ఉంది. ఈ కీని నొక్కడం ద్వారా వినియోగదారులు నెక్స్ట్ మూవ్, క్యాచ్ మీ అప్, పే అటెన్షన్, రిమెంబర్ దిస్ వంటి మోటో AI ఫీచర్లు, ప్రాంప్ట్‌లకి యాక్సెస్ పొందుతారు.
అందులో నెక్స్ట్ మూవ్ యూజర్ స్క్రీన్ పై ఏముందో గుర్తిస్తుంది. క్యాచ్ మీ అప్ ఫీచర్.. బ్లాక్ అయిన నోటిఫికేషన్‌లను కనుగొంటుంది. పే అటెన్షన్ ఫంక్షనాలిటీ.. వాయిస్ లేదా సమావేశాలను రికార్డ్ చేస్తుంది. రిమెంబర్ ఫీచర్.. ఫోటోలు లేదా అలర్ట్‌ల నుండి సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది. తరువాత ప్రాంప్ట్ చేసినప్పుడు కీలక వివరాలు, వాస్తవాలను గుర్తుచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, గ్లోనాస్, గెలీలియో, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 68W టర్బోపవర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది.