/rtv/media/media_files/2025/06/13/7mzMQVHku5EqeKbCbyqK.jpg)
poco x7 pro 5g smartphone huge discount on flipkart
జనవరిలో లాంచ్ అయిన Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు అందిస్తుంది. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తక్కువకు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..
Poco X7 Pro 5G Discount Offers
Poco X7 Pro 5G ఫోన్ లోని 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది జనవరి 2025లో రూ.26,999కి లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999 కి లిస్ట్ అయింది. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ పై 5% తగ్గింపు (రూ.750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత మరింత తగ్గుతుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల రూ.18,400 ఆదా చేయవచ్చు. అయితే ఇంత మొత్తంలో ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు.
Also Read: మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!
Poco X7 Pro 5G Specifications
Poco X7 Pro 5G ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2712 x 1220 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,200 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. ఇది Android 15 ఆధారంగా HyperOS 2.0పై పనిచేస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.
వెనుక భాగంలో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, OIS, EIS మద్దతుతో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 20 -మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB OTG, GPS, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 90W హైపర్‌ఛార్జ్‌కు మద్దతుతో 6,550mAh బ్యాటరీని కలిగి ఉంది.