/rtv/media/media_files/2025/10/04/electric-scooter-offers-2025-10-04-21-44-09.jpg)
Electric Scooter Offers
ప్రస్తుతం పెరుగుతున్న ట్రాఫిక్, ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో రకరకాల కొత్త కంపెనీలు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో అధునాతన ఫీచర్లు, అధిక మైలేజీతో తక్కువ ధరలోనే తమ మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాయి. అవి సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందివ్వడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
భారత మార్కెట్లో ప్రస్తుతం చాలా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఓలా S1X, TVS iQube, బజాజ్ చేతక్, అథర్ రిజ్టా, హోండా యాక్టివా E అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ స్కూటర్లు 50-100 కిలోమీటర్ల మైలైజీ అందిస్తాయి. ఇప్పుడు వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ola S1X
ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. దీని ఎంట్రీ-లెవల్ మోడల్ ఫీచర్-రిచ్‌గా ఉంటుంది. దీని 2025 మోడల్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.79,999 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 4kWh బ్యాటరీ వేరియంట్ IDC-సర్టిఫైడ్ 242 కి.మీ మైలేజీని అందిస్తుంది. అలాగే 5.5kW హబ్ మోటార్ గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగాన్ని అందిస్తుంది. ఇది 7-అంగుళాల TFT డిస్ప్లే, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, OTA అప్‌డేట్‌లు, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
TVS IQUBE
TVS IQUBE కూడా తక్కువ ధరలో భారీ మైలేజ్‌ను అందిస్తుంది. ఇది 2.2kWh, 3.5kWh, 5.1kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీని 2025 మోడల్ రూ.96,422 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను కలిగి ఉంది. దీని 5.1kWh హై వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 212 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది గంటకు 78 కి.మీ వేగాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కూడా 7 అంగులాల టచ్ స్క్రీన్, వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్ సహా మరెన్నో ఫీచర్లున్నాయి.
Bajaj Chetak
బజాజ్ చేతక్ క్లాసిక్ డిజైన్, ఆధునిక టెక్నాలజీని కలిగి ఉంది. 2025 చేతక్ 3501 మోడల్ 3.5kWh బ్యాటరీతో వస్తుంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 153 కి.మీ. మైలేజీ అందిస్తుంది. వినియోగదారులు దీనిని రూ.1,02,400 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుక్కోవచ్చు. దీని 4kW మోటార్ గంటకు 73 km గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
Another Rizta
అథర్ రిజ్టా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభిస్తుంది. అవి 2.9kWh, 3.7kWh. ఇది రూ.1,04,999 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది. దీని 3.7kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్‌పై 159 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ఇది గంటకు 80 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
Honda Activa E
హోండా యాక్టివా E ఎలక్ట్రిక్ వెర్షన్ ఒకే 1.5kWh రిమూవ్ చేయగల బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 102 కి.మీ మైలేజీ అందిస్తుంది. హోండా యాక్టివా-ఇ రూ.117,428 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీగా ఉంది.