Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్.. ఐఫోన్, శామ్‌సంగ్, గూగుల్ ఫోన్లపై వేలకు వేల డిస్కౌంట్‌లు!

ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ ప్రకటించింది. బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఐఫోన్‌ 16ను రూ.56,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మరిన్ని మోడల్స్‌ తక్కువకు లభిస్తున్నాయి. అలాగే శామ్సంగ్, గూగుల్ ఫోన్లను భారీ డిస్కౌంట్‌తో పొందొచ్చు.

New Update
flipkart big festive dhamaka sale

flipkart big festive dhamaka sale

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవలే ‘Big Billion Days Sale’ ను తీసుకొచ్చి స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు సహా మరెన్నో ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్‌లు అందించింది. ఇక ఈ సేల్ రీసెంట్‌గా ముగిసింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్‌ను ప్రకటించి వినియోగదారులకు అదిరిపోయే ట్రీట్ అందించింది. ఈ సారి ‘flipkart big festive dhamaka sale’ పేరుతో కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. 

flipkart big festive dhamaka sale

ఈ సేల్ నేటి (అక్టోబర్ 4) నుంచి ప్రారంభం అయింది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని.. మీరు అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఉత్పత్తులను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఈ సేల్‌లో కస్టమర్లు ఐఫోన్, శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. IPhone 16ను రూ.56,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

అలాగే IPhone 16 Pro ను కూడా అత్యంత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో IPhone 16 Pro ధర రూ.85,999గా నిర్ణయించబడింది. ఇంకా IPhone 16 Pro Max ధర రూ.1,04,999కు లభిస్తుంది. ఈ సేల్ సమయంలో IPhone 14 ను కేవలం రూ. 42,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్లు బిగ్ బిలియన్ డేస్ సేల్ కంటే తక్కువ డిస్కౌంట్లు, ప్రయోజనాలను అందిస్తాయి. 

ఐఫోన్లతో పాటు శామ్సంగ్ ఫోన్లపై గొప్ప డీల్స్ ఉన్నాయి. flipkart big festive dhamaka saleలో samsung galaxy S24 ఫోన్ రూ. 74,999కు లాంచ్ కాగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో కేవలం రూ. 38,999కు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మీరు సేల్ సమయంలో samsung galaxy S24 FE ను రూ. 29,999లకే సొంతం చేసుకోవచ్చు. 

అలాగే శామ్సంగ్ A-సిరీస్ ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. అన్ని డిస్కౌంట్‌ల తర్వాత గెలాక్సీ A35 5Gని కేవలం రూ.17,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా గెలాక్సీ F36 5G కూడా రూ.13,999 నుండి లభిస్తుంది. వీటితో పాటు ఈ సేల్ సమయంలో Google Pixel ఫోన్లు కూడా మంచి తగ్గింపు ధర పొందుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Google Pixel 9a స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.39,999కు కొనుక్కోవచ్చు. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ రూ.100,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ.73,000 తగ్గింపు ఉంది.

Advertisment
తాజా కథనాలు