IPhone 17 Price: ఐఫోన్ 17 ధర రివీల్.. ఒక్కో మోడల్ ప్రైజ్ ఎంతంటే?

ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 9న అఫీషియల్‌గా లాంచ్ కానుంది. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ఎయిర్ ఉన్నాయి. 17ధర రూ.70,404, ప్రో ధర రూ. 96,839, ఎయిర్ ధర రూ. 83,620, ప్రో మాక్స్ ధర రూ.1,05,659గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

New Update
IPhone 17 Price  (1)

IPhone 17 Price

ప్రముఖ అమెరికన్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరో సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు తన లైనప్‌లో ఉన్న 16 సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. అందులోనూ ఒక్కో సిరీస్‌లో నాలుగైదు మోడళ్లను పరిచయం చేసింది. అయితే ఇప్పుడు ఐఫోన్ 17 (IPHONE 17) సిరీస్‌ను త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

Also Read: చంద్ర గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

IPhone 17 Price

ఈ నెల అంటే సెప్టెంబర్ 9న ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఇందులో నాలుగు మోడల్స్ ఉన్నాయి. అవి ఐఫోన్ 17 (Iphone 17), ఐఫోన్ 17 ప్రో (Iphone 17 pro), ఐఫోన్ 17 ప్రో మాక్స్ (Iphone 17 pro max), ఐఫోన్ 17 ఎయిర్ (Iphone 17 air) ఉన్నాయి. రాబోయే ఈ ఐఫోన్‌ల ధరలు లాంచ్ ఈవెంట్‌కు ముందే వెల్లడయ్యాయి. 

Also Read: ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు.. స్పాట్‌లోనే 40 మంది?

ఈ అన్ని ఐఫోన్‌ల ధరల పెరుగుదల గురించి తాజాగా కొన్ని నివేదికలు వస్తున్నాయి. ఐఫోన్ 17 సిరీస్ అంచనా ధరల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ iphone 17 సిరీస్‌లో ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడల్ మాత్రమే భారీ ధరను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర సుమారు రూ. 96,839 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Also Read: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే!

ఇది గత సంవత్సరం విడుదలైన ఐఫోన్ 16 ప్రో కంటే సుమారు రూ. 8,811 ఎక్కువ. ఇక మిగిలిన ఐఫోన్‌ల ధర కూడా ఇదే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 ప్రారంభ ధర ఐఫోన్ 16 మాదిరిగానే సుమారు రూ. 70,404 ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఐఫోన్ 17 ఎయిర్ ధర సుమారు రూ. 83,620 గా ఉండవచ్చని చెబుతున్నారు. ఇది ఐఫోన్ 16 ప్లస్ స్థానంలో సుమారు రూ. 4,406 ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 

ఇంకా ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 1,05,659 గా ఉంటుందని కొన్ని లీక్‌లు చెబుతున్నాయి. అయితే ఈ ధరల అంచనా US మార్కెట్ ప్రకారం మాత్రమే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర ప్రాంతాలలో వీటి ధరలు ఎంత ఉంటాయో ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. ఈ సిరీస్ ధరలపై కంపెనీ త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు