/rtv/media/media_files/2025/07/07/honor-x9c-5g-launched-2025-07-07-13-23-12.jpg)
Honor X9c 5G launched
Honor X9c 5G భారతదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 2024లో ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టారు. చాలా కాలం తర్వాత హానర్ చివరకు దానిని భారతదేశంలో రిలీజ్ చేసింది. Honor X9c 5Gలో 108MP (OIS) ప్రధాన వెనుక కెమెరా, స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC, 6,600mAh బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు దాని ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
Also Read:APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
Honor X9c 5G Price & Offer
భారతదేశంలో Honor X9c 5G ఒకే కాన్ఫిగరేషన్‌లో అందించబడుతుంది. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జాడే సియాన్, టైటానియం బ్లాక్ షేడ్స్‌లో లభిస్తుంది. జూలై 12 నుండి దేశంలో అమెజాన్‌లో సేల్‌కు అందుబాటులో ఉంటుంది.
Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
The wait is finally over.
— Explore HONOR (@ExploreHONOR) July 7, 2025
HONOR X9c 5G is here! Featuring a 108MP camera with OIS, a stunning 6.78" curved AMOLED display, 6600mAh battery with 66W fast charging, and a sleek design built to be unbreakable. It’s also AI-powered for a smarter, smoother experience. First sale goes… pic.twitter.com/MhF8Wtdpei
Honor X9c 5G Bank Offers
లాంచ్ ఆఫర్‌లో కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లు లభిస్తున్నాయి. SBI లేదా ICICI బ్యాంక్ కార్డుల ద్వారా Honor X9c 5G ని కొనుగోలు చేస్తే రూ.750 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇది సేల్ సమయంలో కేవలం రూ.19,999 లభిస్తుంది.
Also Read:గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
Honor X9c 5G Specifications
Honor X9c 5G మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS 9.0 తో వస్తుంది. ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. Honor X9c 5G మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 5-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ ఉంది. ఇది 66W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దుమ్ము, నీటి నిరోధకతకు IP65M రేటింగ్‌ను పొందింది. హానర్ ఫోన్‌లో డ్యూయల్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, OTG, GPS, USB టైప్-C పోర్ట్ మొదలైనవి ఉన్నాయి.