Google: ప్లే స్టోర్‌లో గూగుల్ 331 యాప్స్ రిమూవ్.. అవి మీ ఫోన్‌లో ఉంటే యమ డేంజర్

ప్లే స్టోర్ నుంచి 331 అప్లికేషన్లను డిలెట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు డేటా దొంగలిస్తూ వారిపై సైబర్ దాడులు చేస్తున్నట్లు గూగుల్ నివేదికలు చెబుతున్నాయి. ఆ 331 యాప్‌లు ఇప్పటివరకూ 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

New Update
Play Store

Play Store Photograph: (Play Store)

మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. యూజర్ల డేటాను చోరీకి పాల్పడుతున్న అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. ఆండ్రాయిడ్ 13 OS సెక్యూరిటీ సిస్టమ్స్‌ను మినహాయిస్తున్నాయని దాదాపు 331 యాప్‌లను రిమూవ్ చేసింది. ఈ యాప్‌లు యూజర్లు ప్రైవసీ డేటా సేకరిస్తున్నాయని నివేదికలు వచ్చాయి. మొత్తం 331 యాప్‌లు ప్లేస్టోర్‌లో 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. IAS థ్రెట్ ల్యాబ్‌లోని సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ అప్లికేషన్లలో వేపర్ అని పిలువబడే డేటా స్కామ్ జరుగుతుంది. ఈ యాప్‌ల ద్వారా యూజర్ల పర్సనల్ డేటా దొంగలించడమే కాకుండా.. ఫిషింగ్ ద్వారా క్రెడిట్ కార్డ్ డీటైల్స్ తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఆయా ఆప్‌లో దాదాపు 200 మిలియన్ల ఫేక్ ప్రమోషన్ రిక్వెస్ట్‌లు సృష్టించారు. 

Also read: Rain alert: ఈ జిల్లాల్లో వర్షం దంచుడే.. ఈదురు గాలులు, వడగళ్ల వాన

Also read: Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!

హెల్త్ యాప్స్, ట్రాకింగ్, QR స్కానర్‌లు, వాల్‌పేపర్ యాప్‌లుగా ఈ హానికరమైన యాప్‌లు మారువేషంలో ఉన్నాయి. అవి ఫోన్‌లో యూజర్ ప్రైవసీ దాచగలవు. వినియోగదారు అనుమతి లేకుండా వాటంతట అవే పర్మిషన్లు కూడా ఇచ్చుకోగలవు. మీ దగ్గర ఆండ్రాయిడ్ 13 OS నడుస్తున్న ఫోన్ ఉంటే.. దాన్ని లెటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ డేటా సేఫ్‌గా ఉంటుంది. మీపై సైబర్ అటాక్స్ కూడా జరగడానికి అవకాశం తక్కువ. అలాగే ప్లే స్టోర్‌లో కొత్త అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోసుకునేటప్పుుడు చాలా జాగ్రత్తగా ఉండాలని గూగుల్ సూచిస్తోంది. పెరుగుతున్న టెక్నాలజీ ముప్పును గూగుల్ హైలెట్ చేసింది.

Advertisment
తాజా కథనాలు