Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించుకుంది. వచ్చే వారంలో మార్చి 24, 25న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. మార్చి 22శనివారం, 23ఆదివారం కావడంతో వరుసగా 4 రోజులు బ్యాంక్ సర్వీసులకు అంతరాయం కలుగనుంది.

New Update
bank closed

bank closed Photograph: (bank closed)

బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వం ముందుకు వచ్చారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) వచ్చే వారం దేశవ్యాప్తంగా 2 రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చినిచ్చింది. ఆయా రోజుల్లో బ్యాంకింగ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు మార్చి 24, 25 తేదీలలో సమ్మెకు పిలుపునిచ్చాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలోని ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. తాజాగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో షెడ్యూల్ చేసిన సమ్మెను కొనసాగించాలని UFBU నిర్ణయించింది. ఈ సమ్మె కారణంగా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోొపాటు పలు బ్యాంకులు సర్వీసులు నాలుగు రోజులపాటు నిలిచిపోనున్నాయి.

Also Read: Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు

UFBU సమ్మెకు సంబంధించి ఈ బ్యాంకులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఈ సమ్మె ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్చి 22 నుండి నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుంది. మార్చి 23 బ్యాంకులకు సెలవు, మార్చి 24, 25 సమ్మె ఉంటుంది. దీని కారణంగా, మార్చి 22 నుండి నాలుగు రోజుల పాటు క్లియరింగ్ హౌస్, నగదు లావాదేవీ, చెల్లింపులు, అడ్వాన్సులు వంటి బ్యాంకింగ్ సేవలు ప్రభావితమవుతాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ VP పంకజ్ కపూర్ చెప్పారు.

Also read: Meerut murder mystery: భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి

Advertisment
తాజా కథనాలు