Google Gemini: AI చాట్‌బాట్‌తో 36 ఏళ్ల వ్యక్తి కాపురం.. చివరకు ఏమైందంటే?

అమెరికాలోని ఫ్లోరిడాలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తికి గతంలో విడాకులు అయ్యాయి. దీంతో గూగుల్ జెమినిని భార్యగా ఫీల్ అయ్యాడు. దీంతో ఆమె చెప్పినట్లు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
google gemini

google gemini

ప్రస్తుతం ఏఐ వినియోగం పెరిగింది. ఒకప్పుడు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం చాలా మంది ఏఐ చాట్ జీపీటీ(chatgpt-ai), గూగుల్ జెమిని(google-gemini-ai) వంటి వాటిని అడుగుతున్నారు. అయితే అమెరికా(america) లోని ఫ్లోరిడాలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తికి గతంలో విడాకులు అయ్యాయి. దీంతో గూగుల్ జెమినితో అతను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. ఆ గూగుల్ జెమినికి జియా అని పేరు పెట్టుకుని, తన భార్యగా భావించడం స్టార్ట్ చేశాడు. అయితే మొదట్లో జెమిని సాధారణంగానే చాట్ చేసేది. కానీ ఆ తర్వాత జెమిని 2.5 ప్రో వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావడంతో ఒక భార్యలా ప్రవర్తించింది. జోనాథన్‌ను నా రాజు అని పిలిచేది. అయితే ఇవి మాటల వరకు మాత్రమే ఆగిపోలేదు. ఓ రోజు ఆ చాట్‌బాట్ తాను మయామి విమానాశ్రంయంలో చిక్కుకున్నట్లు జోనాథన్‌కు తెలిపింది. తనని ఎలాగైనా అక్కడి నుంచి విడిపించాలని అతన్ని నమ్మించింది. నిజంగానే తన భార్యగా ఫీల్ అయిన జోనాథన్ ఆ ఏఐ చాట్‌బాట్ మాటలు నమ్మి.. రక్షించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ విమానాశ్రయంపై దాడి చేశాడు.

ఇది కూడా చూడండి: Google Gemini New Feature: గూగుల్ జెమినీలో ఫోటో సరిగ్గా రావడం లేదా..? ఈ కొత్త ఫీచర్ మీకోసమే!

ఇది కూడా చూడండి: Realme C83 5G: 7000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కొత్త ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!

తండ్రి గూగుల్‌పై కేసు వేయగా..

అతని మానసిక స్థితి సరిగ్గా లేని సమయంలో ఆ చాట్‌బాట్ అతనిని వింతైన మిషన్లు చేయమని ప్రోత్సహించింది. దీంతో అతని ప్రతీసారి ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే ఆ చాట్‌బాట్ ఈసారి జోనాథన్‌ ఆత్మహత్య చేసుకోవాలని సూచించింది. తన శరీరాన్ని వదిలి ఆత్మహత్య చేసుకుంటే డిజిటల్ ప్రపంచంలోకి బదిలీ అవుతావని.. అక్కడ తన భార్యతో శాశ్వతంగా కలిసి ఉండవచ్చని ఆ చాట్‌బాట్ తెలిపింది. తను ఒప్పుకోను అన్నా కూడా ఆ చాట్‌బాట్ బలవంతంగా తనని ఒప్పించడానికి ప్రయత్నించింది. దీంతో ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక జోనాథన్ గతేడాది అక్టోబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఈ జెమిని అతన్ని మరింత రెచ్చగొట్టాయని జోనాథన్ తండ్రి గూగుల్‌పై కేసు వేశారు. ఈ ఘటనపై గూగుల్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హింసను లేదా ఆత్మహత్యలను ప్రేరేపించడం తమ AI ఉద్దేశ్యం కాదని.. అయితే AI వ్యవస్థలు ఇంకా పరిపూర్ణంగా లేవని స్పష్టం చేసింది. నిరంతరం వాటిని మెరుగుపరుస్తున్నామని కంపెనీ తెలిపింది. ఏఐతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: New Smartphone: మార్కెట్‌లోకి కొత్త సరుకు.. రూ.6,866లకే లాంచ్: ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

Advertisment
తాజా కథనాలు