AI.com Website: లక్ అంటే ఇదేనేమో.. రూ.300కు పెడితే రూ.634 కోట్లకు లాభం

మలేషియాకు చెందిన టెక్ వ్యవస్థాపకుడు అరిసాన్ ఇస్మాయిల్ 1993లో కేవలం 10 ఏళ్ల వయసున్నప్పుడు, తన తల్లి క్రెడిట్ కార్డు ఉపయోగించి AI.com అనే వెబ్‌సైట్ అడ్రస్‌ను (డొమైన్) కొనుగోలు చేశాడు. అప్పట్లో దీని ధర కేవలం 100 డాలర్లు (అంటే సుమారు రూ.300).

New Update
AI.com

మలేషియాకు చెందిన టెక్ వ్యవస్థాపకుడు అరిసాన్ ఇస్మాయిల్ 1993లో కేవలం 10 ఏళ్ల వయసున్నప్పుడు, తన తల్లి క్రెడిట్ కార్డు ఉపయోగించి AI.com అనే వెబ్‌సైట్ అడ్రస్‌ను (డొమైన్)(Website Domain) కొనుగోలు చేశాడు. అప్పట్లో దీని ధర కేవలం 100 డాలర్లు (అంటే సుమారు రూ.300). విచిత్రమేమిటంటే, అప్పట్లో ఆయనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ఏమీ తెలియదు. కేవలం తన పేరులోని ఆద్యక్షరాలు (Arsyan Ismail - AI) కలిసి వస్తాయనే ఉద్దేశంతో సరదాగా ఆ పేరును ఎంచుకున్నాడు.

Also Read :  AI: 'కొవిడ్ కన్నా పెద్దది జరగబోతోంది'.. ఏఐపై హైప్‌రైటర్ సీఈవో సంచలన హెచ్చరిక

AI.com Website

కానీ కాలక్రమేణా టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఒక విప్లవంగా మారింది. దీంతో 'AI.com' అనే పేరుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో, ప్రముఖ డిజిటల్ కరెన్సీ ప్లాట్‌ఫామ్ క్రిప్టో డాట్‌కామ్ (Crypto.com) సీఈఓ క్రిస్ మార్స్‌జాలెక్ ఈ డొమైన్‌ను కొనుగోలు చేసేందుకు భారీ ఆఫర్ ఇచ్చారు.

చివరికి 2025 ఏప్రిల్‌లో ఈ డీల్ కుదిరింది. క్రిస్ మార్స్‌జాలెక్ ఏకంగా 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ.634 కోట్లు) చెల్లించి ఆ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం లావాదేవీ క్రిప్టో కరెన్సీలోనే జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో బహిరంగంగా వెల్లడించిన అత్యంత ఖరీదైన డొమైన్ విక్రయంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.

ముప్పై ఏళ్ల క్రితం ఒక చిన్న పిల్లాడు సరదాగా కొన్న పేరు, నేడు అతన్ని కోటీశ్వరుడిని చేయడమే కాకుండా ప్రపంచ రికార్డులో నిలబెట్టింది. దీన్నే "అదృష్టం అంటే నీలా ఉండాలి" అని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. - viral news telugu

Also Read :  కింగ్ మేకర్ గా ఎంపీ రఘునందన్.. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్!

Advertisment
తాజా కథనాలు