TDP Chief Chandra Babu: సీఎం జగన్ పై(CM Jagan) విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాజాగా వైసీపీ ఇంఛార్జులను (YCP Incharges) మార్చడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎన్నికల (AP Elections) కోసం జగన్ వేసుకున్న లెక్కలు తారుమారు అయ్యాయని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు చంద్రబాబు.
ALSO READ: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!
ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ 11 మంది ఇంఛార్జిలను మార్చారని పేర్కొన్నారు. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుందా అంటూ సీఎం జగన్ పై చురకలు అంటించారు. గత నాలుగేళ్ళ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLA's) ప్రజలను భయాందోళనకు గురి చేశారని విమర్శించారు. ప్రజలు తిరుగుబాటు చేసే సరికి మార్పులు చేశారని అన్నారు. ఐదుగురు దళితులను బదిలీ చేశారని పేర్కొన్నారు. బీసీలపై సీఎం జగన్ కు అంత ప్రేమ ఉంటే పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
25 లక్షల ఎకరాల్లో పంట నష్టం: చంద్రబాబు
మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని అన్నారు చంద్రబాబు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వ్యాఖ్యానించారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చు అని అభిప్రాయపడ్డారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే పంట ముందుగానే చేతికి వచ్చేదని పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుఫానుల బారి నుంచి పంటలు కాపాడుకునేవాళ్లమని తెలిపారు.
ALSO READ: Big Breaking: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు విడుదల