USA: ఉక్రెయిన్ కు షాక్..మిలటరీ సాయం నిలిపేసిన అమెరికా
అమెరికా లో ఓవల్ ఆఫీస్ లో గొడవ తర్వాత ఉక్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు ఇస్తున్న మిలటరీ సహాయాన్ని ఉపక్రమించుకుంటున్నామని ప్రకటించారు.
అమెరికా లో ఓవల్ ఆఫీస్ లో గొడవ తర్వాత ఉక్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు ఇస్తున్న మిలటరీ సహాయాన్ని ఉపక్రమించుకుంటున్నామని ప్రకటించారు.
ఉక్రెయిన్ ఆవేదనను ప్రపంచం వినాలి అంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్‌లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తించుకోవాలని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో గొడవ అయ్యాక.. జెలెన్ స్కీ తన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.
అమెరికాలో ఓవల్ కార్యాలయంలో ఈరోజు ట్రంప్, జెలెన్ స్కీ ల మధ్య జరిగిన వివాదంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. రష్యా...ట్రంప్ ను సమర్ధించగా..నాటో దేశాలు మాత్రం జెలెన్ ఒంటరివాడు కాదంటూ ఉక్రెయిన్ కు మద్దతును ప్రకటిస్తున్నాయి.
సడెన్ గా అమెరికా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైట్ హౌస్ లో ట్రంప్ , జెలెన్ స్కీ వివాదం జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న ఐపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిచారు. గట్టిగా మాట్లాడద్దు అంటూ జెలెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్యాపై యుద్ధం చేసేందుకు అమెరికా తమకు 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఇలా స్పందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్ చేసుకుంటావా? అంటూ ఫైర్ అయ్యారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ..జెలెన్ స్కీకి ఫోన్ చేసి మద్దతుగా నిలిచారు.జెలెన్ స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైనచర్యే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కూడా ఇలాగే చేసిందంటూ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు సమాచారం అనే వలయంలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలం అవుతుందని అన్నారు.