Zelensky-Starmer: ఉక్రెయిన్‌ కి మద్దతుగా బ్రిటన్ ప్రధాని!

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ..జెలెన్‌ స్కీకి ఫోన్ చేసి మద్దతుగా నిలిచారు.జెలెన్‌ స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైనచర్యే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కూడా ఇలాగే చేసిందంటూ వెల్లడించారు.

New Update
keir

keir

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆయన ఒక నియంత అని..అందుకే దేశంలో ఎన్నికలు నిర్వహించడం లేదంటూ మండిపడ్డారు.ఈ నేపథ్యంలోనే స్పందించిన బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ..జెలెన్‌ స్కీకి ఫోన్ చేసి మద్దతుగా నిలిచారు.

Also Read: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..

జెలెన్‌ స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైనచర్యే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కూడా ఇలాగే చేసింది. నాడు ఎన్నికలను జరపలేదు. అది సమంజసమే. ఉక్రెయిన్‌ లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా చేసే ప్రయత్నానికి మా మద్దతు ఉంటుంది. 

Also Read: ఛాంపియన్ ట్రోఫిలో భారత్‌ శుభారంభం.. మొదటి మ్యాచ్‌లోనే విక్టరీ

భవిష్యత్తులో రష్యా దురాక్రమణలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటుంది అని డౌనింగ్‌ స్ట్రీట్ ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్‌ వాదనను ఇటీవల ట్రంప్‌ తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు.ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. 

ట్రంప్ ఏమన్నారంటే..ఎన్నికలు లేని నియంత..

అయితే దీనింతటికీ కారణం ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని విమర్శించడమే అని తెలుస్తోంది. జెలెన్ స్కీ పదవీ కాలం ముగిసినా ఆయన ఇంకా పదవిలోనే ఉన్నారని...యుద్ధ సమయంలో ఎన్నికలు అవసరం లేనందున ఉండిపోయారని అన్నారు. ఎన్నికలు లేని నియంతగా ప్రవర్తిస్తున్నారని ఘాటూ విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా కాస్త భూమి ఇస్తే పోయేదానికి అనసవరంగా యుద్ధం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ తో సహా వేలల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోపించారు ట్రంప్. యుద్ధానిక ముందే ఉక్రెయిన్ , రష్యాతో ఒప్పందం చేసుకుంటే మంచిది కదా...జెలెన్ స్కీ ఆ పని ఎందుకు చేయలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ మాస్కోపై ఎప్పటికీ గెలవలేదు. నేను లేకుండా ఆ యుద్ధాన్ని ఎవరు కొలిక్కి తీసుకురాలేరని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

మరోవైపు శాంతి చర్చల్లో తాము పాల్గొనమని ఉక్రెయిన్ అనడాన్ని అమెరికా అధ్యక్షుడు తప్పుబట్టారు. ఉక్రెయిన్‌ను వారికి ఇప్పించేలా నేను ప్లాన్ చేస్తుంటే.. అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటిని ప్రశ్నించారు.  రష్యా-ఉక్రెయిన్ ల మధ్య బుధ్దిలేని యుద్ధం జరుగుతోందని...దీనిని రష్యా ఆపాలనుకుంటోంది అంటూ ట్రంప్ ఆ దేశానికి మద్దతుగా మాట్లాడారు. 

Also Read: Director Shanker: డైరెక్టర్ శంకర్‌కు ED బిగ్ షాక్.. కోట్ల ఆస్తులు జప్తు!

Also Read: YS Jagan: నేను ఎవడికీ భయపడను.. వైఎస్ జగన్‌ సంచలన పోస్ట్!

Advertisment
తాజా కథనాలు