Donald Trump vs Zelenskyy: జెలెన్ స్కీ పై విరుచుకుపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు

సడెన్ గా అమెరికా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైట్ హౌస్ లో ట్రంప్ , జెలెన్ స్కీ వివాదం జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న ఐపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిచారు. గట్టిగా మాట్లాడద్దు అంటూ జెలెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
usa

Trump, JD Vanns, Zelen Sky

Donald Trump vs Zelenskyy: వైట్ హౌస్, మీడియా సాక్షిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాటలతో యుద్ధం చేసుకున్నారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే.. లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ అంటే మమ్మల్ని మీరు బెదిరించలేరు అంటూ జెలెన్ స్కీ తిట్టుకుంటున్నారు. అరుదైన ఖనిజాల తవ్వకంపై మాట్లాడ్డానికి వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలంటూ  ఒత్తిడి తెచ్చారు. ఇది ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లకు విపరీతమైన కోసం తెప్పించింది. దీంతో ట్రంప్...తాము శాంతి ఒప్పందం కుదుర్చే ప్రయత్నం చేస్తుంటే జెలెన్ స్కీ వ్యవహార శైలి బాలేదంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

అదే టైమ్ లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కలుగజేసుకుని గట్టిగా మాట్లాడద్దొంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడికి  హితవు పలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు. ‘ఎలాంటి దౌత్యం?’ అంటూ జెలెన్‌స్కీ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్‌ ఒకింత అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. మామూలుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ చాలా కామ్ గా ఉంటారు పెద్దగా మాట్లాడరు. కానీ ఈరోజు ఆయన కూడా జెలెన్ స్కీ మీద విరుచుకుపడ్డారు. 

Also Read:HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

నేనేం తప్పు చేయలేదు...

మరోవైపు వైట్ హౌస్ లో జరిగిన దానిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. అక్కడ నుంచి వచ్చేశాక మీడియాతో మాట్లాడారు. తాను ఎవరికీ క్షమాపణ చెప్పాల్సి అవసరం లేదని చెప్పారు. అలాంటిదేమీ లేదు. నేను అధ్యక్షుడిని, అమెరికన్‌ ప్రజలను గౌరవిస్తాను. కానీ ఈరోజు నేను ఏదో తప్పుచేశానని అనుకోవడం లేదని ఆయన అన్నారు. ట్రంప్ తమవైపే ఉండాలని తాము అనడం లేదని...తటస్థంగా ఉండాలని మాత్రమే కోరుతున్నామని జెలెన్ చెప్పారు. 

Also Read: TS: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Also Read:హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

Advertisment
తాజా కథనాలు