USA: ఉక్రెయిన్ కు షాక్..మిలటరీ సాయం నిలిపేసిన అమెరికా

అమెరికా లో ఓవల్ ఆఫీస్ లో గొడవ తర్వాత  ఉక్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు ఇస్తున్న మిలటరీ సహాయాన్ని ఉపక్రమించుకుంటున్నామని ప్రకటించారు. 

author-image
By Manogna alamuru
New Update
Donald Trump

Donald Trump

రష్యాతో శాంతి చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని కోసం ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. మూడేళ్ళుగా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మిలటరీ ఉక్రెయిన్ కు దన్నుగా నిలబడింది. ఇప్పుడు ట్రంప్ ఆదేశాలతో ఈ మిటలరీ సాయం ఇక మీదట ఉండదు. జెలెన్ స్కీ రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు ట్రంప్. 

మొత్తం ఆగిపోతుంది..

 ప్రస్తుతం ట్రంప్ ఇచ్చిన ఆదేశాలకు మేరకు ఉక్రెయిన్ కు ఇచ్చిన అన్ని సైనిక పరికరాలను వెనక్కు తీసేసుకుంటోంది అమెరికా.  జెలెన్ స్కీ తగ్గి చర్చలకు వెనక్కు వస్తేనే మిటలరీ ఫ్రీజ్ రూల్ ను ఎత్తేస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఆ దేశానికి ఎగుమతి అవుతున్న ట్యాంకర్లు, ఫిరంగి గుండ్లు, రాకెట్లు అన్నీ వెళ్ళకుండా ఆగిపోతాయి. 

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో మినరల్స్‌ డీల్‌కు సిద్ధమేనని తెలిపారు. తాము అమెరికాకు రుణపడి ఉంటామని కూడా వరుస ట్వీట్లు చేశారు. ఉక్రెయిన్‌ నిజమైన శాంతిని కోరుకుంటోందని.. అందుకోమే తాము అమెరికాకు వచ్చామని తెలిపారు.ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు మేము సిద్ధమే. భద్రకు గ్యారంటీ ఇచ్చేందుకు ఇది తొలి అడుగు అవుతుంది. కానీ ఇది సరిపోదని అన్నారు. సెక్యూరిటీ గ్యారెంటీలు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందం ఉక్రెయిన్‌కు చాలా ప్రమాదకరం. గత మూడేళ్లుగా మేము పోరాడుతున్నాం. అమెరికా తమ వైపే ఉందని ఉక్రెయిన్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్స్‌లో తెలిపారు.

Also Read: Champions Trophy: ఆసీస్ బ్యాటర్ల వేగానికి భారత స్పిన్నర్లు కళ్ళెం వేస్తారా?

Advertisment
తాజా కథనాలు