మెదక్ జిల్లా పేరు వింటే.. నాకు ఆమె గుర్తుకు వస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
జహీరాబాద్ బహిరంగసభలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన అన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటామని తెలిపారు.