Viral Video: 'మా నాన్నను జైల్లో వేయండి'.. ఓ ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..!
మా నాన్నని జైల్లో వేయండి.. నన్ను ఆడుకోనివ్వట్లేదంటూ ఓ ఐదేళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్ లోని ధార్‌కు చెందిన హుస్సేన్ వచ్చీరాని మాటలతో కానిస్టేబుల్‌కు తన తండ్రిపై కంప్లెంట్ చేశాడు. అయితే, ఇందుకు వాళ్ల నాన్నతోనే వెళ్లడం విశేషం.