/rtv/media/media_files/2025/01/17/XfyItIKU18xximXAhhfa.jpg)
viral video
Viral video:రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ(Sankranti Festival) సంబరాలు అంబరాన్నంటాయి. పిండి వంటలు, దైవ దర్శనాలు, చుట్టాల సందడి, ముగ్గుల పోటీలు, పతంగుల జోరుతో కనుల విందుగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. వీటితో పాటు సంక్రాంతి అనగానే అందరికీ ప్రధానంగా గుర్తొచ్చేది కోడి పందేలు జోరుగా సాగాయి. పండక్కు నెల రోజుల ముందు నుంచే యజమానులు కోళ్లకు బాదాం, పిస్తా పెట్టి పందేనికి సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో ఓ పందెం కోడికి సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.
Also Read:'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ ఊచకోత.. తొలి రోజే ఎన్ని కోట్లంటే !
ఫన్నీ వీడియో
పందెం కోసమని తెచ్చిన పుంజు పందేనికి ముందే పారిపోయి తన యజమానికి షాకిచ్చింది. దీంతో యజమాని పుంజు కోసం వెతగ్గా ఓ ఎండిపోయిన బావిలో దాక్కొని కనిపించింది. అయితే బావిలో పుంజు మాత్రమే కాదు.. దాంతో పాటు పెట్ట కూడా ఉంది. దీంతో ఈ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ''పందెం కి పోయి సచ్చేదాని కంటే ప్రేమించిన పెట్టతో పారిపొడం బెటర్ అనుకుందేమో అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
పందెం కి పోయి సచ్చేదాని కంటే ప్రేమించిన పెట్టతో పారిపొడం బెటర్ అనుకోని వుంటది
— SwAthi (@imswathi21) January 16, 2025
అర్ధం కాని విషయం ఏంటంటే
పారిపోయే ప్రాసెస్ లో బావిలో పడినాయ లేక సూసైడ్ చేసుకుందాం అని పడినాయ.? pic.twitter.com/D29KbYkNjK
Also Read:లాస్ ఏంజెలెస్ నుంచి మహేశ్ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్!
Also Read: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!
Follow Us