BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలో దారుణం జరిగింది. దూలపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిషిక కెమికల్‌ గోడౌన్‌లో మంటలు ఎగిసి పడుతున్నాయి. పొగలు, మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

New Update
Fire accident in Jeedimetla

Fire accident in Jeedimetla

తెలంగాణలో ఈ మద్య ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు సంభవించడం గమనార్హం. మొన్నామధ్య అబిడ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ తర్వాత మాదాపూర్‌లోని సత్వ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే మాదాపూర్‌లోని ఖానామెట్‌లో సైతం భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇవి మరువక ముందే ఇప్పుడు ఓరి బాబోయ్ అనేలా మరో ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో రిషిక కెమికల్‌ గోడౌన్‌లో మంటలు ఎగిసి పడుతున్నాయి. వాటి మధ్య దట్టమైన పొగలు చుట్టూ ఉన్న ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు