తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ నాయకులపై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే జేసీ ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటాడని అంతా అనుకుంటుంటారు. ఆయన ఎలాంటి ఎంజాయ్‌మెంట్‌కు వెళ్లడని చెప్తుంటారు. ఇది కూడా చదవండి: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే జేసీ మాస్ డ్యాన్స్ కానీ తాజాగా వైరల్ అవుతోన్న వీడియో చూస్తే మాత్రం అలా అనిపించదు. 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి దుమ్ముదులిపేశారు. తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు జేసీ డ్యాన్స్ వేశారు. పక్కన ఉన్న మహిళలు, అమ్మాయిలతో కలసి కాలు కదిపారు. డీజే లైటింగ్‌కు, సాంగ్‌కు తోడు జేసీ తగ్గేదే లే స్టెప్పు అదిరిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువతులతో కలిసి పుష్ప సినిమాలో సూసేకి అగ్గిరవ్వ పాటకు డాన్స్ ఇరగదీసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి... #JCPrabhakarReddy #tadipatri #rtvnews pic.twitter.com/Wz6eq3f2lw — RTV (@RTVnewsnetwork) January 4, 2025 ఇది కూడా చదవండి: AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు ఈవెంట్ వివాదం ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు రోజులుగా ఇదే అంశం నెట్టింట రచ్చ లేపుతోంది. ఈ ఈవెంట్‌కు ముందు సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్‌కు మహిళలు ఎవరూ వెళ్లొద్దని అన్నారు. ఇది కూడా చదవండి: అనకాపల్లి టూ ఆనందపురం హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈవెంట్ కోసం జేసీ ప్రభాకర్ దగ్గరకు వెళ్తే అక్కడ దారుణాలు జరుగుతాయని ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. దానిపై జేసీ ఘాటుగా స్పందించారు. మాధవీలత ఒక ప్రాసిక్యూటర్ అని, అలాంటి వాల్లు తన గురించి మాట్లాడుతారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే తరుణంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. ఇక దీని వెనుక కచ్చితంగా బీజేపీ హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.