దక్షిణ కెన్యాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మకునిలోని దక్షిణ కౌంటీ ముకుకు అనే మారుమూల గ్రామంలో ఆకాశం నుంచి కొన్ని శిధిలాలు కిందికి పడ్డాయి. గుండ్రంగా ఉంగరం ఆకారంలో ఉన్న ఆ పెద్ద లోహాన్ని చూసి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అది ఏంటా అని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది కూడా చూడండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు దీంతో ఈ విషయం తెలియగానే అధికారులు అక్కడకు చేరుకుని.. ఆ ప్రాంతాన్ని భద్రపరిచారు. అనంతరం ఆ శిధిలాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అది ఒక రాకెట్ నుండి వచ్చిన లోహపు శకలమని కెన్యా అధికారులు తెలిపారు. ఆ వస్తువు 2.5 మీటర్లు (సుమారు 8 అడుగులు) వెడల్పు, 500 కిలోల (సుమారు 1,100 పౌండ్లు) బరువున్న స్పేస్ జంక్‌గా పేర్కొన్నారు. Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్ ఇలాంటివి చాలా అరుదు అది రాకెట్ నుండి వేరు చేయబడిన రింగ్ అని తెలిసింది. అంతరిక్ష శిధిలాలు సాధారణంగా సముద్రంలో పడిపోతాయి లేదా భూమిపై పడేముందు గాల్లోనే కాలిపోతాయి. అంతరిక్షంలో ఉన్న అనేక శిధిలాలు ఎక్కడ పడతాయో 100 శాతం ఖచ్చితంగా చెప్పలేమని కెన్యా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అయితే గాల్లో చాలా శిధిలాలు కాలిపోతాయని.. కానీ ఇలాంటి సంఘటనలు చాలా అరుదు అని పేర్కొంది. ఈ వస్తువు ప్రజల భద్రతకు ముప్పు లేదని ఆ సంస్థ తెలిపింది. ఇది కూడా చదవండి: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు! Panic in Kenya as half-ton glowing space debris crashes into village.Loud blast sparks bomb fears before object identified as rocket junkKenyan Space Agency investigating origin of object identified as launch rocket's separation ring.Who's giving space junk asteroids? pic.twitter.com/m9uQVgsDRe — RT (@RT_com) January 3, 2025 అయితే ఆ వస్తువు ఆకాశం పైనుంచి పడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వారు స్థానిక మీడియాతో చెప్పారు. పైనుంచి అతి పెద్ద వస్తువు ఎర్రగా.. వేడి వేడిగా ఉండి కింద పడిందని వారు అన్నారు. ఇది కూడా చదవండి: సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల! ఇలా తొలిసారి కాదు కాగా ఇలా జరగడం తొలిసారి కాదు. గతంలో కూడా రాకెట్ శకలాలు చాలానే భూమ్మీద పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియన్ గొర్రెల ఫారమ్‌లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండింగ్ అయింది. అలాగే గతేడాది కూడా ఒక శకలం ఫ్లోరిడాలోని ఇంటిపై పడటంతో ఇల్లు కూలిపోయింది. దీనిపై అమెరికన్ కుటుంబం నుండి NASA దావాను ఎదుర్కొంది.