/rtv/media/media_files/2025/05/08/30BtywCfefsgHL0VVwnt.jpg)
Bandari Raji Reddy
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హబ్సిగూడ లోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. బండారి రాజిరెడ్డి 2009లో ఉప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అనారోగ్య కారణాల వల్ల #ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి
— AHMAD PASHA BRS🧢 (@AhmedPa37742375) May 8, 2025
గారు మరణించారు.
కావున అందరూ హబ్సిగూడ లోని ఆయన నివాసానికి అందరూ రాగలరు.@BrsBandari@BRSparty@santhoshbr2351pic.twitter.com/bIg4afPYPQ
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి
బండారి రాజిరెడ్డి 1945లో నాచారంలో జన్మించారు. ఆయన మల్లాపూర్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో తోమిదోతరగతి వరకు చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాజిరెడ్డి.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై 28,183 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also read : Operation sindoor : హ్యాట్సాఫ్.. ఇది కదా దేశభక్తి అంటే.. ఆడపిల్ల పుట్టినందుకు..!
2012లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పని చేశారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన సోదరుడు బండారి లక్ష్మారెడ్డిని పోటీలో నిలుపగా ఆయన ఓడిపోయారు. అనంతరం లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరి 2023 ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండిపోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
Also Read : ‘35 ఏళ్లు అయింది..ఆ ఉంగరం, చేప ఎక్కడ ? రామ్ చరణ్, చిరంజీవి వీడియో వైరల్ !
Also Read : లాహోర్‌లో పేలుళ్లు.. భారత గూఢచారి డ్రోన్ను కూల్చివేసిన పాక్ !
uppal | congress | Bandari Raji Reddy | telangana