Telangana: రైతుల ఖాతాల్లో రూ.7,770.83 కోట్లు జమ: మంత్రి తుమ్మల
తెలంగాణలో శనివారం నాటికి 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. కేవలం 6 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోకి రూ.7,770.83 కోట్ల నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తెలంగాణలో శనివారం నాటికి 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. కేవలం 6 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోకి రూ.7,770.83 కోట్ల నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తెలంగాణలో కాలుష్యరహితంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు యత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి ఆయన ప్రారంభించారు.
తెలంగాణ పామాయిల్ రైతులకు దసరా కానుక అందించింది రేవంత్ సర్కార్. పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచింది. కాగా ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
జులై 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు.
వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు రైతు భరోసా సాయం అందుతుందని స్ప,ష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం అమలుపై కసరత్తును ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులను పంట రుణాలు రికవరీ కోసం ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలు, బ్యాంకులను మంత్రి కోరారు.
బీఆర్ఎస్ నాయకులు సిగ్గు, బుద్ధి, జ్ఞానం లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. నల్గొండ సభలో కేసీఆర్ మాటలు చూసి ప్రజలు నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవంటూ ఎల్బీ స్టేడియం వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్కాజిగిరి కాంగ్రెస్‌లో పరిణామాలు పార్టీ కేడర్ లో అయోమయం నింపుతున్నాయి. లోకసభ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశానికి మైనంపల్లి హనుమంతరావు హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ పోటాపోటీగా రాజకీయాలు సాగుతున్నాయి. నిన్న ముగ్గురు బీఆర్ఎస్ సర్పంచ్ లు పొంగులేటి, తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పువ్వాడ 24 గంటలు గడవక ముందే వారికి మళ్లీ గులాబీ కండువా కప్పేలా చక్రం తిప్పారు.