/rtv/media/media_files/2025/10/11/indira-mahila-shakti-scheme-2025-10-11-07-05-07.jpg)
Indira Mahila Shakti Scheme free sarees
Free Sarees : ఇందిరా మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఇవ్వాలనుకున్న ఉచిత చీరలపై రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగానే చీరల పంపిణీ ఉంటుందని ముందుగా ప్రచారం సాగినప్పటికీ చీరల నేత పూర్తి కాకపోవడంతో పంపిణీ జరగలేదు. ఒక్కో మహిళకు రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తారని చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో నవంబర్ నాటికి చీరలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Also Read : నన్ను ఓడగొట్టారు... అంజన్‌కుమార్ సంచలన కామెంట్స్
స్వయం సహాయ సంఘాల సభ్యులకు పంపిణీ చేయనున్న ఉచిత చీరలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. నవంబరు 15 నాటికి సిద్ధం చేసి సంక్రాంతి నాటికి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి, సచివాలయంలో నిర్వహించిన చేనేత, జౌళిశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 64.69 లక్షల చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించాము దీనికి గాను 33.35 లక్షలు ఉత్పత్తి చేసి జిల్లా గోదాములకు పంపించాం. వచ్చే నెల 15 నాటికి తయారీ పూర్తి చేసి గోదాములకు తరలించి పంపిణీకి సిద్ధం చేయాలి. అని ఆయన అధికారులకు సూచించారు.
Also Read : బసవతారకం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..రూ. 750 కోట్ల భూమికి హైడ్రా విముక్తి
ఇక రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తి చేసి వారి ఖాతాల్లో నిధులను జమ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. నేతన్న భరోసా పథకానికి 13,371 మంది నమోదు చేసుకోగా.. ఇంకా 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీని యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి మార్చేందుకు సన్నాహాలు చేయాలి’’ అని మంత్రి వారికి సూచించారు.
Also Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్యAlso Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య