Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఇవే.. మరి కాంగ్రెస్ ఒప్పుకునేనా..?
ఖమ్మంలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. జంపింగ్ జపాంగ్లతో స్టే్ట్ లుక్ అంతా ఖమ్మంపై పడింది. ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలు.. పార్టీ అధినేత ముఖం చాటేయడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గం అంతా కాంగ్రెస్లో పార్టీలో చేరగా.. ఇప్పుడు మరో నేత కూడా ఆయన మార్గంలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.