రైతులకు రేవంత్ సర్కార్ దసరా కానుక.. వాటి మద్దతు ధర పెంపు!

తెలంగాణ పామాయిల్‌ రైతులకు దసరా కానుక అందించింది రేవంత్ సర్కార్. పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచింది. కాగా ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

New Update
Thummala Nageswara Rao: రూటు మార్చుతున్న తుమ్మల..త్వరలో సంచలన నిర్ణయం!!

Palm Trees: తెలంగాణలో పామాయిల్ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. వారికి దసరా కానుక అందించేందుకు సిద్ధమైంది. పామాయిల్ మద్దతు ధరను పెంచింది. రూ.17,043 లకు పామాయిల్ గెలల ధర పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పామాయిల్ రైతుల కుటుంబాలలో ముందే దసరా పండగ వచ్చిందని అన్నారు.

పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి తెలంగాణలో సాగు లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తిరిగి విధించి దేశీయ రైతులను ఆదుకోవాలని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను కోరినట్లు చెప్పారు. స్పందించిన కేంద్రం ఇటీవల ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం 5.5 నుంచి 27.5 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.

సన్న వడ్లకు రూ.500లకు బోనస్...

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిని అమలు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో రాష్ట్ర మంత్రి వర్గం ఈ పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతు పండించిన సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అలాగే రైతు భరోసా (రైతు బంధు) నిధులను రాష్ట్ర ప్రభుత్వం దసరా లోపు రైతుల ఖాతాలో జమ చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా దీనిపై ఇంకా ఎక్కడ అధికారిక ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం చేయలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు