BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!
తిరుమలలో కారు దగ్ధమైంది.షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది.
తిరుమలలో కారు దగ్ధమైంది.షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఐదేళ్లలో తిరుమలలో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు.
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఈ రోజు దర్శించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.
తిరుమలకు సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్రోల్మెంట్ స్లిప్ తెచ్చుకుంటే క్యూ లైన్లో నిల్చునే బాధ లేకుండా సిబ్బంది నేరుగా గదులను కేటాయించనున్నట్లు తెలిపింది.
తిరుమలలో ఘోర అపచారం జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వారిని టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసిందని ఆరోపించారు. తిరుమలలో మహాపచారం జరుగుతోందన్నారు.
ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.మొత్తం 70వేల లడ్డూలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ పది నుంచి మూడు రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ తెలిపింది.
శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.