Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు!
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ,ట్రంప్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌నే వెల్లడించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.మోడీ గొప్ప ప్రధాన మంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.
ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు వాషింగ్టన్ మధ్య వర్తిత్వాన్ని మాస్కో తలకిందులు చేస్తోందని మండిపడ్డారు.
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అవుతుంది.అందులో మస్క్ అమెరికా వ్యక్తి కాదని, ప్రభుత్వం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడని వాన్స్ అన్నట్లు ఉంది. కానీ అది ఏఐ సృష్టించిన ఆడియో అని వాన్స్ దానిని కొట్టిపారేశారు.
టెస్లా అధినేత మస్క్ తనకు మంచి స్నేహితుడు అయ్యాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తనకు ఎన్నికల్లో ఎంతో సాయం చేశారని.. కానీ ఏరోజు తన నుంచి చిన్న సాయం కూడా పొందలేడని చెప్పుకొచ్చారు.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు తగ్గించాలని భారత్ యోచిస్తోంది. సుంకాలను తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా వస్తువులపై విధిస్తున్న పన్నులు తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
అమెరికా బలగాలు ఇటీవల యెమెన్‌పై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందే ఈ దాడుల ప్లాన్ ఓ గ్రూప్ చాట్ ద్వారా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ లీక్స్ ఎలా జరిగిందనే విషయం తనకు కూడా తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించాడు.