అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. కొత్త టారిఫ్‌లు వచ్చిన తర్వాత నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దేశాన్ని నాశనం చేయొద్దని అంటున్నారు. ''హ్యాండ్స్ ఆఫ్'' పేరుతో 50 రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: 2030 నాటికి ఏఐకి మానవ మేధస్సు.. ముప్పు పొంచి ఉందంటున్న నిపుణులు
ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో దేశంలోని ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని.. దీనివల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగేందుకు దారి తీస్తున్నాయని అమెరికా పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హూస్టన్, ఫ్లోరిడా, కొలరాడో, లాస్ ఏంజెల్స్, మన్‌హట్టన్, వాషింగ్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, చికాగోలో భారీగా ర్యాలీలు చేస్తున్నారు. '' మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్'' అంటే ఇదేనా ? అంటూ నిలదీస్తున్నారు.
Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!
యూరోపియన్ యూనియన్ క్యాపిటల్స్‌లో కూడా ప్రజలు నిరసనలు తెలియజేశారు. ట్రంప్ నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయన వైఖరి వల్ల ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని మండిపడ్డారు. ట్రంప్ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాడని, అతనొక వెర్రోడని ఓ 70 ఏళ్ల వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాన్ మస్క్‌పై కూడా అమెరికన్లు మండిపడుతున్నారు. మస్క్‌ను ఎవరూ ఎన్నుకోలేదనే నినాదాలు చేస్తున్నారు. స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ ఆఫీసులు వద్ద పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తు్న్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం, ఖర్చులు తగ్గించేందుకు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read: సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు!
trump | rtv-news | america | protest