Trump: చమురు ధరలు తగ్గాయి.. ద్రవ్యోల్బణం లేదు: ట్రంప్

ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. చమురు ధరలు తగ్గిపోయాయి. దీనిపై స్పందించిన ట్రంప్ చములు ధరలు తగ్గాక.. ద్రవ్యోల్బణం ఎక్కడిదని ప్రశ్నించారు. వడ్డీ రేట్లు, ఆహార పదార్థాల రేట్లు తగ్గాయని ద్రవ్యోల్బణ ఏమీ లేదన్నారు.

New Update
Trump

Trump

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల ట్రేడ్‌వార్ ఆందోళనలు మొదలయ్యాయి. దీని ప్రభావం వల్ల సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. అలాగే చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. ట్రంప్ సుంకాల వల్ల వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక మాంద్యం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్‌లో స్పందించారు. 

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

'' అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. అలాంటప్పుడు ఇంకెక్కడ ద్రవ్యోల్బణం. గతంతో పోలిస్తే ప్రస్తుత సుంకాలు వల్ల చమురు ధరలు తగ్గిపోయాయి. వడ్డీ రేట్లు, ఆహార పదార్థాల రేట్లు కూడా తగ్గాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పడం తప్పు. అలాంటిదేమి జరగడం లేదు. అమెరికా నుంచి బయటకు వెళ్లిపోయిన బిలియన్ డాలర్ల సొమ్ము ఈ టారిఫ్‌ల ద్వారా కొన్ని రోజుల్లోనే తిరిగి వస్తుంది.  

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చైనా మాపై ఎక్కువగా సుంకాలు వేసింది. దశాబ్దాలుగా మా నుంచి లబ్ధి పొందుతోంది. గతంలో ఉన్న మా పాలకుల వల్లే ఇది జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే మరింత నష్టపోయేవాళ్లం. టారిఫ్‌లు ఇలా విధించకూడదని నా హెచ్చరికలను చైనా నిర్లక్ష్యం చేసింది. మరోసారి ఇలా జరగనివ్వము. చైనా ఇప్పుడు 34 శాతం సుంకాలు విధించింది. ఈ పరిణామాల వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాను ఇంకా గొప్పగా చేస్తామని'' ట్రంప్ పేర్కొన్నారు . 

Also Read: రేపు ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....

Also Read: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు