TTD: వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులకు TTD చైర్మన్ అదిరిపోయే శుభవార్త!
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట వేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేసినట్లు చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట వేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేసినట్లు చెప్పారు.
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్‌ను డెలివరీ చేస్తోంది. ముంబాయి, బెంగళూరు వంటి నగరాల్లో ఈ క్విక్ డెలివరీ సర్వీస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పై సొంత చెల్లే లైగింక వేధింపుల ఆరోపణలు చేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సోదరుడు శామ్ తనపై లైగింక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
శ్రీలీల బాలీవుడ్ లోనూ ప్రయాణం మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి కనిపించింది. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. రూ.35 వేల నగదు, కొంత డాలర్లు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 37 ఏళ్ల సమీర్ అన్సారీని నిందితుడిగా గుర్తించారు
ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూడీపై ఆపార్టీ చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను పోటీ నుంచి తప్పించి.. ఆ స్థానం నుంచి ఓ మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
మెగా డాటర్ నిహారిక అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన పై తొలిసారి స్పందించారు. ఆ ఘటన తనను ఎంతో బాధించిందని. విషయం తెలిసిన తర్వాత తన మనసు ముక్కలైందని అన్నారు. అందరి ప్రేమాభిమానాలు, మద్దతుతో అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారని తెలిపారు.
రీసెంట్గా గోవాకు పర్యాటకులు తగ్గిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కానీ చివరకు అవన్నీ అబద్ధాలని తేలాయి. గోవాలో టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందుతోందని..ఇంతకు ముందు కంటే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
నాసిరకం జీవనశైలి, ఆహారం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని తాగవచ్చు. తాజా ఆకులను తీసుకుని రసం తీసి ఖాళీ కడుపుతో తాగాలి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.