Poonam Dhillon : ఎంతకు తెగించార్రా.. బాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం

నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. రూ.35 వేల నగదు, కొంత డాలర్లు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు   37 ఏళ్ల సమీర్‌ అన్సారీని నిందితుడిగా గుర్తించారు

New Update
Poonam Dhillon

Poonam Dhillon Photograph: (Poonam Dhillon)

ముంబైలోని బాలీవుడ్ (Bollywood) నటి పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) ఇంట్లో సోమవారం లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. ఇంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.35 వేల నగదు, కొంత డాలర్లు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు   37 ఏళ్ల సమీర్‌ అన్సారీని నిందితుడిగా గుర్తించారు.  సమీర్ అన్సారీ  నటి పూనమ్  ఇంటికి పెయింటింగ్ వేయాడానికి వచ్చాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 5 వరకు ఖార్‌లోని ఆమె ఇంట్లో పెయింటింగ్ వర్క్ చేసిన  అన్సారీ తాళం వేసివున్న అల్మారాలో ఉన్న   డైమండ్ నెక్లెస్ తో పాటుగా రూ.35 వేల డబ్బు, కొన్ని విలువైన వస్తువులను  ఎత్తుకెళ్లాడు.  

Also Read :  సంధ్యా థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ పై మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్ !

ఇష్టం సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు

దోచుకున్న డబ్బులో కొంత భాగాన్ని స్నేహితులకు ఇచ్చిన పార్టీ కోసం ఖర్చు చేశానని అన్సారీ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.  1977లో, పూనమ్ ధిల్లాన్ మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది.  2001లో విడుదలైన ఇష్టం సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నటిగానే కాకుండా ఆమె సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగానూ ఎదిగింది. మాదకద్రవ్యాలు, ఎయిడ్స్, కుటుంబ నియంత్రణ, అవయవ దానం వంటి సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో ఆమె చాలా చురుకుగా ఉంటుంది.   

Also Read :  ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి :  కోర్టు మెట్లెక్కిన రమ్య

2004లో, ఆమె భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరి, 2019 నాటికి ఆ పార్టీ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగింది.  సినిమా నిర్మాత అశోక్ థాకేరియాను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు, కుమార్తె పలోమా, కుమారుడు అన్మోల్ ఉన్నారు.  పూనమ్ ధిల్లాన్ చివరిసారిగా జై మమ్మీ డిలో సోనల్లిలో  సెగల్ సన్నీ సింగ్ తో కలిసి నటించారు. ఆమె పత్తర్ కే ఇన్సాన్, జై శివ శంకర్, రామయ్యా వస్తావయ్యా, బట్వారా వంటి అనేక ఇతర చిత్రాలలో నటించింది.

Also Read :  గోవాలో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు.. చైనాదంతా అబద్ధపు ప్రచారం

Also Read :  అరెస్ట్ తర్వాత బన్నీ భార్య తొలి పోస్ట్ వైరల్.. అందులో ఏముందంటే?

Advertisment
తాజా కథనాలు