Shadnagar: దొంగతనం నెపంతో దళిత మహిళపై ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ.. సీఎం రేవంత్ సీరియస్!
బంగారం దొంగతనం కేసులో దళిత మహిళ సునీతను షాద్ నగర్ పోలీసులు చిత్రహింసలుపెట్టిన ఇష్యూ సంచలనంగా మారింది. ఆమె బట్టలు విప్పి, కాళ్ల మధ్యన కర్రలు పెట్టి, బూటు కాళ్లతో తొక్కినట్లు విచారణలో తేలడంతో సీఐ రాంరెడ్డితోపాటు 5గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు సీపీ అవినాష్.