Shadnagar: దొంగతనం నెపంతో దళిత మహిళపై ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ.. సీఎం రేవంత్ సీరియస్! బంగారం దొంగతనం కేసులో దళిత మహిళ సునీతను షాద్ నగర్ పోలీసులు చిత్రహింసలుపెట్టిన ఇష్యూ సంచలనంగా మారింది. ఆమె బట్టలు విప్పి, కాళ్ల మధ్యన కర్రలు పెట్టి, బూటు కాళ్లతో తొక్కినట్లు విచారణలో తేలడంతో సీఐ రాంరెడ్డితోపాటు 5గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు సీపీ అవినాష్. By srinivas 05 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Shadnagar: మహబూబ్ నగర్ షాద్ నగర్ లో అమానుష ఘటన జరిగింది. బంగారం దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ దళిత మహిళను అదుపులోకి తీసుకుని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. నిజం ఒప్పుకోవాలంటూ తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారు. పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి మూర్చపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో బాధితురాలి గాయాలపై జండ్ బామ్ రాయించడం సంచలనంగా మారింది. అంతేకాదు ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించగా.. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతుంది. బట్టలు విప్పించి, కాళ్ల మధ్యన కర్రలు పెట్టి.. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని వీరిపై గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్, అఖిల మొత్తం 5 మంది పోలీసులు సునీత, భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్, తల్లి కొడుకులను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. ఈ క్రమంలోనే డిఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు తెలిపింది. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి రాత్రి తనను బట్టలు విప్పించి, చెడ్డి తొడిగించి, కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ కొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదినట్లు కన్నీరు పెట్టుకుంది. దొంగతనం ఒప్పుకోవాలంటూ ఆమె కొడుకు జగదీశ్వర్ ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్ తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా సునితను ఇంటికి పంపించారు. ఇది కూడా చదవండి: BREAKING: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా! తులం బంగారం 4 వేల రూపాయలు రికవరీ.. నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దొంగతనం చేసింది సునీతనేనని ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నామని, మొత్తం 26 ఆరు తులాల బంగారం రెండు లక్షల నగదు పోయిందని బాధితులు ఫిర్యాదు చేయగా.. అందులో ఒక తులం బంగారం నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టు తెలిపారు. జరిగిన దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని చెప్పారు. విచారణలోనే భాగంగానే ఆమెను స్టేషన్ కు తీసుకు వచ్చామన్నారు. బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని అది విచారణలో తేలుతుందన్నారు. అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కొట్టిన దెబ్బలతో బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకనే రిమాండ్ చేయ్యలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టారు. షాద్ నగర్ సీఐ రాంరెడ్డిని హైదరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. మరో ఐదుగురు కానిస్టేబుల్స్ పై సైతం సస్పెన్షన్ వేటు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం పోలీసుల తీరుపు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. #dalit-woman #theft-case #ci-ramreddy #shadnagar-ps మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి