Visakha Patnam: నా కెరీర్ నాశనం చేశారు..వాళ్ళని వదలను-సౌమ్యశెట్టి 74 తులాల బంగారం చోరీ చేసిన తెలుగు నటి సౌమ్య శెట్టి.. అంటూ వరుస బ్రేకింగ్‌లు గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్ అవుతున్నాయి. విశాఖలో సంచలనంగా మారిన ఈ కేసులో నిందితురాలు సౌమ్య ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. రివర్స్ కంప్లైంట్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. By Manogna alamuru 26 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Sowmya Shetti: విశాఖ చోరీ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదల అయిన సౌమ్య శెట్టి కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తమ మీద తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమె జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు ఇచ్చింది. తన మీద ఆరోపణలు చేసిన మోనిక, ప్రసాద్‌ల మీదనే కాకుండా పోలీసుల మీద కూడా కంప్లైంట్ చేసింది సౌమ్య. జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటూ లోకాయుక్తలోని ఫిర్యాదు ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. గీతూ రాయల్, ధనుష్‌ల మీద పరువు నష్టం.. మరో వైపు కోర్టులో ఏదీ రుజువు కాకముందే నా జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేశారంటూ బిగ్ బాస్ ఫేమ్ గీతూరాయల్, యాంకర్ ధనుష్‌ల మీద ఫైర్ అవుతోంది సౌమ్య. తనపై దుష్ప్రచారం చేశాని ఆరోపిస్తోంది. వీరిద్దరి మీద పరువు నష్టం దావా వేస్తానని చెబుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. ఉన్నది లేననట్టుగా.. లేనిది ఉన్నట్టుగా.. తనని దొంగగా చిత్రీకరించారని అంటోంది సౌమ్య. వీరికి కొన్ని మీడియా సంస్థలు కూడా సహకరించాయని వాటి మీద కూడా పరువు నష్టం దావా వేస్తానని చెబుతోంది సౌమ్యాశెట్టి. విశాఖకు చెందిన సౌమ్యశెట్టి నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. ఈమెకు అపార్టుమెంటులో పోస్టల్ శాఖ రిటైర్డ్ అధికారి జనపాల ప్రసాద్ బాబు కూతురు మోనిక ఫ్రెండ్. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చేశారు. ఈ పరిచయంతోనే సౌమ్య మోనిక ఇంటికి వెళ్ళేది. ఆ క్రమంలో వారి ఇంటి నుంచి 74 తులాల బంగారం చోరీ చేసింది. ఆడబ్బుతోనే గోవా వెళ్ళి కొంత ఖర్చు పెట్టింది. మొత్తం నాలుగు విడతలగా బంగారాన్ని చోరీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వేలిముద్రల ఆధారంగా సౌమ్యను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. Also Read:Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు #andhra-pradesh #theft-case #social-media #sowmya-shetti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి