Elections: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్పై తీర్పును రిజర్వు చేసింది.