/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
దసరా పర్వదినాన అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం దసరా పండుగ సందర్భంగా ఉరవకొండలోని పాతపేటకు చెందిన సుంకున్న(40), కల్పన దంపతులు.. తమ కొడుకు సన్నీ, కూతురు భవానితో కలిసి బైక్‌పై వజ్రకరూర్ మండలం వైపు వెళ్తున్నారు.
Also Read: రామ్‌లీలా మైదానంలో ఘనంగా రావణ దహనం
ఈ క్రమంలోనే ప్యాపిలి వద్ద ఓ గుర్తు తెలియని వాహనం వాళ్ల బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి సుంకన్న, కొడుకు సన్నీ(8)కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వాళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి కల్పన, కూతురు భవానీకి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వీళ్లను ఉరవకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దసరా పండుగ వేళ ఈ విషాదం నెలకొనడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: ఆపిల్ ఐఫోన్, ఐపాడ్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?