🛑 LIVE UPDATES: బాక్సింగ్ డే టెస్టు.. లైవ్ అప్డేట్స్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం అయింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం అయింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నారు. అతని ఆరోగ్యం కోలుకుంటోంది. తనకు బాలేనప్పుడు సహాయం చేసిన సచిన్ టెండూల్కర్‌కు వినోద్ కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ ట్రోఫీలో భారత్ దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనుంది.
పారిస్ ఒలింపిక్స్ విజేత మను బాకర్‌కు ఊహించని షాక్ తగిలింది. క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న అవార్డుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదని తెలుస్తోంది. దీనిపై మను తండ్రి రామ్‌కిషన్ బాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మను అప్లికేషన్ ఇవ్వలేదని కమిటీ చెబుతోంది.
వెస్టిండీస్‌తో మూడువన్డేల సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. వడోదరలో జరిగిన తొలిమ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. 211 పరుగుల తేడాతో విండీస్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. 315పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన విండీస్ 103 పరుగులకే ఆలౌటైంది.
పీఎఫ్ ఫ్రాడ్ కేసుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. పీఎఫ్ నిధుల దుర్వినియోగంలో నా ప్రమేయం లేదని, తాను ఎవరినీ మోసం చేయలేదంటూ ప్రకటన రిలీజ్ చేశాడు. తనకు రావాల్సి ఫండ్స్ కంపెనీ ఇవ్వలేదని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయన్నారు.
అండర్ - 19 ఆసియా కప్ విజేతగా టీమిండియా మహిళా జట్టు అవతరించింది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో మొదటిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేసింది. 41 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది..
అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌గా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 118 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 76 పరుగులకే అలౌట్ అయ్యింది.